నాగోలు-మియాపూర్ మధ్య తొలి దశ మెట్రో రైలును ప్రారంభిస్తున్నాం: మహమూద్ అలీ
- పట్టణ రవాణా వ్యవస్థపై హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు
- మాట్లాడిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
- ఈ నెల 28న మెట్రో తొలిదశ ప్రారంభమని స్పష్టం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో మహమూద్ అలీ మాట్లాడుతూ... ఈ నెల 28న మెట్రో తొలిదశను ప్రారంభించనున్నట్లు, ఆ రోజు నుంచి నగరంలోని నాగోలు-మియాపూర్ మధ్య మెట్రో రైలు పరుగులు పెట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.