బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ ఇక డిప్యూటీ కలెక్టర్!
- శ్రీకాంత్‌పై కాసుల వర్షం..
- రూ. 2 కోట్ల నజరానా.. అమరావతిలో స్థలం
- ఏపీ మంత్రి మండలి నిర్ణయం
విజయాలను అలవాటుగా మార్చుకున్న శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన లీ చాంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్ సరసన నిలిచాడు. అద్భుత విజయాలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాని మంత్రి మండలి ఆకాంక్షించింది.