భూటాన్ బుల్లి రాజు గ్యాల్సీతో భార‌త విదేశాంగ మంత్రి సుష్మా ముచ్చట్లు
Add ap7am to your home Screen

భూటాన్ బుల్లి రాజు గ్యాల్సీతో భార‌త విదేశాంగ మంత్రి సుష్మా ముచ్చట్లు

  • కుటుంబస‌మేతంగా ఢిల్లీ విచ్చేసిన భూటాన్ రాజు
  • స్వాగ‌తం ప‌లికిన కేంద్ర విదేశాంగ మంత్రి
  • యువ‌రాజు గ్యాల్సీతో ముచ్చ‌టించిన సుష్మా
నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం భూటాన్ రాజు జిగ్మే ఖేస‌ర్ నంగ్యేల్ వాంగ్‌చుక్ కుటుంబ‌స‌మేతంగా భార‌త్ విచ్చేశారు. వాంగ్‌చుక్‌, ఆయ‌న స‌తీమ‌ణి జెస్టున్ పెమా, వారి కుమారుడు, యువ‌రాజు గ్యాల్సీలు మంగ‌ళ‌వారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఆత్మీయ‌స్వాగ‌తం ప‌లికారు. బుధ‌వారం త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశానికి భూటాన్ రాజు హాజ‌ర‌య్యారు.

అక్క‌డ మీడియా దృష్ట‌నంతా బుల్లి యువ‌రాజు గ్యాల్సీ ఆక‌ర్షించాడు. భూటాన్ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన వాంగ్‌చుక్ కుటుంబం, సుష్మా స్వ‌రాజ్‌తో క‌లిసి ఫొటోలు దిగారు. ఈ సంద‌ర్భంగా గ్యాల్సీతో సుష్మా కాసేపు ముచ్చ‌టించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాంగ్‌చుక్ ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై వారు చర్చించనున్నారు.
bhutan
prince
king
queen
wang chuk
foreign minister
sushma swaraj

More Telugu News