దమ్ముంటే 2020లో మళ్లీ పోటీకి సిద్ధం కావాలి!: ... హిల్లరీ క్లింటన్ కు ట్రంప్ సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దమ్ముంటే 2020లో మళ్లీ పోటీకి సిద్ధం కావాలి!: ... హిల్లరీ క్లింటన్ కు ట్రంప్ సవాల్

  • విమర్శల వేడిని పెంచిన హిల్లరీ
  • దీటుగా సమాధానం ఇచ్చిన ట్రంప్ 
  • తనతో మళ్లీ పోటీకి రావాలని సవాల్
గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన డొనాల్డ్ ట్రంప్ పై హిల్లరీ క్లింటన్ ఇటీవలి కాలంలో విమర్శల వేడిని పెంచిన నేపథ్యంలో ట్రంప్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే 2020లో తనతో అధ్యక్ష పదవికి పోటీ పడాలని ఆయన సవాల్ విసిరారు. రీ మ్యాచ్ కి సిద్ధమవ్వాలని, తనతో పరుగు పందానికి తయారవ్వాలని ఆమెకు సూచించారు. అమెరికాలో జాత్యహంకారం పెరుగుతోందని ఆమె ఇటీవల వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తూ, అటువంటి మాటలే 2016లో హిల్లరీని ఓడించాయని అన్నారు.

"హిల్లరీ పోటీలో దిగుతుందని భావిస్తున్నాను. హిల్లరీ... ప్లీజ్ రన్ ఎగైన్" అని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ వ్యాఖ్యానించారు. హిల్లరీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని, మెజారిటీ అమెరికన్లపై ఆమె అభాండాలు మోపారని ట్రంప్ ఆరోపించారు. ఇదిలావుండగా, డెమొక్రాట్ల తరఫున గత సంవత్సరం ట్రంప్ తో పోటీపడి ఓటమి పాలైన హిల్లరీ, మరోసారి వైట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు తాను ప్రయత్నించబోనని ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడించారు. ట్రంప్ రెండో విడత అవకాశాన్ని తాను అడ్డుకోబోనని, డెమొక్రాట్ల తరఫున ఎవరు నిలబడ్డా పూర్తి మద్దతు ఇస్తానని అన్నారు.
trump
hillary
us

More Telugu News