ట్రంప్ అగ్గి రాజేశాడు... దావానలం దహించనుంది: ఉత్తర కొరియా
- అణు పరీక్షలు జరిగి తీరుతాయి
- అమెరికాతో సమానమని నిరూపించుకుంటాం
- అమెరికాలోని ఏ ప్రదేశాన్నైనా కొట్టగలం
- ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి
తమకు సంబంధించినంత వరకూ శాంతి, రక్షణ ముఖ్యమని, దేశ రక్షణ కోసం ఎంత దూరమైనా వెళతామని చెప్పారు. కేవలం ట్రంప్ వైఖరి కారణంగానే ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, తమ వద్ద మాత్రమే ఆయుధాలు ఉండాలనడం, ఇతరుల వద్ద వద్దని చెప్పడం అమెరికాకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అమెరికాతో సమతుల్యాన్ని సాధించేలా ఆయుధాలను పెంచుకోవాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.