సచివాలయంలో ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు

10-10-2017 Tue 18:24 | Both States
  • రాజధాని నిర్మాణం, రైతు రుణమాపీ మూడో దశ అమలుపై ప్రధానంగా చర్చ
  • ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకానికి మంత్రివర్గం ఆమోదం
  • మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ఎస్ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
  • పలు ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుపై చర్చ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడి అధ్యక్షతన అమ‌రావ‌తిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, రైతు రుణమాఫీ మూడో దశ అమలు, పుల్లెల గోపీచంద్‌ అకాడమీతో పాటు ఇతర సంస్థలకు భూ కేటాయింపులు, సిటిజన్‌ ఛార్టర్‌ అమలు, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, చక్రపాణి కమిటీ నివేదికతో పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

బీసీ సామాజిక వర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు ‘చంద్రన్న పెళ్లి కానుక’ పేరుతో రూ.30వేలు అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులు ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చించారు. పోలవరం కుడి కాలువకు ఆనుకుని ఐదో నంబర్ జాతీయ రహదారిని 8వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ఎస్ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
చంద్రబాబు

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more