ram gopal varma: ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఉంటుందన్న రామ్ గోపాల్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అయిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి (పలమనేరు) ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్రంలోని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు. 
Go Back to Shorts
ram gopal varma
lakshmi's ntr
mla roja

More Telugu News