నాగ్, సమంతలను ఒప్పించడంతోనే పూర్తి సక్సెస్ ను సాధించాను : ఓంకార్
- ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజుగారి గది 2'
- రెండవ సినిమానే స్టార్స్ తో చేయడం పట్ల ఆనందం
- నాగ్, సమంత రాకతో సినిమా స్థాయి పెరిగింది
- ఈ నెల 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు
చిన్న సినిమాగానే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళదామని అనుకున్నాననీ, అయితే పీవీపీ వారు .. మ్యాట్నీ సంస్థ వారు నిర్మాతలుగా ముందుకు రావడంతో ఈ సినిమా స్థాయి పెరిగిందని అన్నారు. ఇక ఈ కథను వినిపించిన 5 నిమిషాల్లోనే ఈ సినిమా చేస్తున్నట్టు నాగ్ చెప్పడంతో, తాను సగం సక్సెస్ ను సాధించినట్టు భావించానని చెప్పారు. ఇక సమంత కూడా "కథ సూపర్బ్" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు విషయంలో పూర్తి సక్సెస్ ను సాధించినట్టుగా భావించానని అన్నారు. నాగ్ .. సమంత ఎంట్రీ కారణంగా ఇది పెద్ద ప్రాజెక్టుగా మారిపోయిందనీ .. అందరిలోను అంచనాలను పెంచేసిందని చెప్పుకొచ్చారు.