ఎన్టీఆర్ బయోపిక్ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ?
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ?

  • ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం దిశగా బాలకృష్ణ
  • యంగ్ ఎన్టీఆర్ గా కనిపించనున్న మోక్షజ్ఞ
  • వేగవంతంగా జరుగుతోన్న స్క్రిప్ట్ పనులు
  • జనవరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్  
నందమూరి అభిమానులంతా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ టీనేజ్ కి సంబంధించిన పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది తాజా సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ టీనేజ్ పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో బాలకృష్ణ ఉన్నారట. అయితే తాను హీరో కావడానికి మరి కొంత సమయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని మోక్షజ్ఞ వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమాతో జరిగితేనే బాగుంటుందంటూ .. ఈ సినిమాకి గల ప్రత్యేకతను అతనికి బాలకృష్ణ వివరించినట్టు సమాచారం. ఈ సినిమాకి  స్క్రిప్ట్ పనులు పూర్తి కావొస్తున్నాయనీ, దర్శకుడిగా తేజ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
balakrishna
mokshagna

More Telugu News