సినిమాల్లోకి సారా టెండూల్కర్... సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?
- బాలీవుడ్ ఎంట్రీకి సారా టెండూల్కర్ రెడీ?
- సారాను లాంఛ్ చేయనున్న అమీర్ ఖాన్
- రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ సరసన సారా
- కూతురికి స్వేచ్ఛ నిచ్చిన సచిన్
గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చానని తెలిపాడు. ఆమెకు అవసరమైన సూచనలు మాత్రమే చేస్తానని అప్పట్లో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సారా సినీ రంగ ప్రవేశంపై వార్తలు వెలువడడంతో సచిన్ తన కుమార్తె బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.