ఉత్తరకొరియాలో అనుభవించిన నరకాన్ని ప్రపంచానికి వెల్లడించిన మహిళ!
Add ap7am to your home Screen

ఉత్తరకొరియాలో అనుభవించిన నరకాన్ని ప్రపంచానికి వెల్లడించిన మహిళ!

  • ఉత్తరకొరియాలో సెక్స్ బానిసలుగా యువతులు
  • కిమ్ పరివారం ఇళ్లలో సెక్స్ బానిసలు
  • తమను తాము రాజులుగా పరిగణించుకునే కిమ్ పరివారం
  • తప్పుచేసినా, నచ్చకపోయినా, గర్భందాల్చినా ఇక వారిపని ఖతం
ఉత్తరకొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆ దేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచం కళ్లకు కట్టింది. హీ యోన్ లిమ్ (26) టీనేజ్ లో ఉండగా కిమ్ సైన్యం ఆమెను ఎత్తుకెళ్లారు. ఆ తరువాత ఆమెను సెక్స్ బానిసగా కిమ్ పరివారం ఇళ్లకు తిప్పారు. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని ఆమె తెలిపారు. ఒకరి తరువాత ఒకరి ఇంటికి సెక్స్ బానిసలుగా పంపుతారని అన్నారు. తానే కాదని తనలాంటి చాలా మంది యువతులు వారిళ్లలో సెక్స్ బానిసలుగా మగ్గుతున్నారని ఆమె చెప్పారు.

తామంతా వారి చేతుల్లో నలిగిపోతూ నరకం అనుభవిస్తుంటే వారు ఆనందంతో రెచ్చిపోతారని ఆమె తెలిపారు. కిమ్ పాలనలో ప్రజలంతా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సెక్స్ బానిసలు నచ్చకపోయినా, ఏదైనా తప్పు చేసినా, గర్భం దాల్చినా వారిని కనిపించకుండా చేస్తారని ఆమె వాపోయారు. పోర్నోగ్రఫీ చూశారన్న కారణంతో సంగీత బృందంలోని 11 మంది సభ్యులను పొలాల్లోకి ఈడ్చుకొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ గన్ లతో తుక్కుతుక్కుగా కాల్చేశారని, అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారని ఆమె చెప్పారు.

 కిమ్ జాంగ్ ఉన్ కు విశ్వాసంగా లేరని అనిపిస్తే చాలు, వారిని వెంటనే ఉరితీస్తారని ఆమె తెలిపారు. తాము అతి కష్టం మీద ఉత్తరకొరియా నుంచి చైనాకు.. అక్కడి నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నామని ఆమె తెలిపారు. సియోల్ లో ప్రస్తుతం ఉంటున్నానని ఆమె తెలిపారు. 
north Korea
kim jong un
he yone lim

More Telugu News