చెక్కిన శిల్పంలా ఉంది... ఎమ్మీ అవార్డుల‌కు హాజ‌రైన ప్రియాంక చోప్రా వ‌స్త్ర‌ధార‌ణ‌పై నెటిజ‌న్ల కామెంట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెక్కిన శిల్పంలా ఉంది... ఎమ్మీ అవార్డుల‌కు హాజ‌రైన ప్రియాంక చోప్రా వ‌స్త్ర‌ధార‌ణ‌పై నెటిజ‌న్ల కామెంట్‌!

ఒకప్పుడు భార‌తీయులు హాలీవుడ్ టీవీ షోల‌ను అడ‌పాద‌డ‌పా చూసేవారు. కానీ ఇప్పుడు టీవీ షోల‌తో పాటు వాటికి సంబంధించిన అవార్డు వేడుక‌ల‌ను కూడా చూస్తున్నారు. కార‌ణం.. గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంక చోప్రా. ఆదివారం జ‌రిగిన 69వ ఎమ్మీ అవార్డుల వేడుక‌ల్లో ఆమె ఎంట్రీ కోసం ఎదురుచూడ‌ని భార‌తీయుడు లేడ‌న‌టం అతిశ‌యోక్తి కాదేమో! ముఖ్యంగా ఆమె ఎలాంటి వ‌స్త్ర‌ధార‌ణ‌లో హాజ‌రవనుందనే విష‌యంపైనే అభిమానులు దృష్టి సారించారు.

వారి ఊహాగానాల‌కు త‌గ్గ‌ట్లే ప్రియాంక తెల్ల‌గా మెరిసే పెద్ద‌గౌన్‌లో త‌ళుక్కుమంది. ఆమె వ‌స్త్ర‌ధార‌ణ‌కు అభిమానులంతా ఫిదా అయిపోయారు. `ఆ డ్రెస్‌లో ప్రియాంక శిల్పంలా ఉంది`, `ఎమ్మీ కార్య‌క్ర‌మంలో బెస్ట్ డ్రెస్ అవార్డు ప్రియాంక‌కే... మిగ‌తా వాళ్లు ఇళ్ల‌కు వెళ్లిపోండి!`, `ప్రియాంక బీన్ బ్యాగ్ వేసుకొచ్చినా... ఆమెకే బెస్ట్ డ్రెస్ అవార్డు వ‌స్తుంది` అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. లాస్ ఏంజెలీస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు ఆంథోనీ ఆండ‌ర్స‌న్‌తో క‌లిసి ఉత్త‌మ ఔట్‌స్టాండింగ్ వెరైటీ టాక్ సిరీస్ అవార్డును జాన్ ఆలివ‌ర్‌కు ఆమె అంద‌జేసింది.
priyanka chopra
emmy awards
stunning dress
peecee

More Telugu News