ఒక్క మెట్టు కూడా తగ్గేది లేదు... ఆరునూరైనా అనుకున్నది చేస్తా: కిమ్ జాంగ్ ఉన్
- మరిన్ని కటువు వ్యాఖ్యలు చేసిన కిమ్ జాంగ్ ఉన్
- అమెరికాతో సమానంగా నిలవడమే లక్ష్యమన్న అధినేత
- అందుకు చాలా దగ్గరకు వచ్చామని వెల్లడి
- కిమ్ వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందంటున్న నిపుణులు
- త్వరలోనే పరీక్షలకు స్వస్తి చెప్పవచ్చని అంచనాలు
కాగా, కిమ్ జాంగ్ చేసిన కటువు వ్యాఖ్యల వెనుక, ఆయన మనసులోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాతో సమానమయ్యే శక్తిని పొందేందుకు ఎంతో కాలం పట్టదని ఆయన చెప్పిన మాటలు, త్వరలోనే క్షిపణి పరీక్షలకు స్వస్తి చెప్పే అవకాశాలను చూపిస్తున్నాయని సియోల్ లోని యోన్సే యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ డీలూరీ అభిప్రాయపడ్డారు. సమానత్వ సాధన అన్న మాటలు, భవిష్యత్తులో చర్చలకు తాను అనుకూలమన్న సంకేతాలకు నిదర్శనమని విశ్లేషించారు.