'అదుర్స్ 2' పై ఆసక్తి చూపుతోన్న వినాయక్!
Add ap7am to your home Screen

'అదుర్స్ 2' పై ఆసక్తి చూపుతోన్న వినాయక్!

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అదుర్స్' ఒకటిగా కనిపిస్తుంది. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అప్పట్లో భారీ వసూళ్లను సాధించింది. అనేక మార్లు టీవీలో ప్రసారం చేసినా ఇప్పటికీ ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వస్తుండటం విశేషం. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన వినాయక్ కి ఎప్పటి నుంచో వుంది. సీక్వెల్ కి తగిన కథను సిద్ధం చేయమని తాజాగా ఆయన కోన వెంకట్ కి చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం కోన వెంకట్ అదే పనిలో వున్నాడని అంటున్నారు.

అయితే 'అదుర్స్' సినిమా సీక్వెల్ చేయడానికి అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఉత్సాహాన్ని చూపించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఆయన అంతగా ఆసక్తి చూపక పోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఒకదానికొకటి పూర్తి భిన్నంగా వుండే సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. అందువలన ఆయన ఈ సీక్వెల్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      
ntr
vinayak

More Telugu News