పూరి దర్శకత్వంలో ఛాన్స్ రావడం అదృష్టం: శ్రియ
Add ap7am to your home Screen

పూరి దర్శకత్వంలో ఛాన్స్ రావడం అదృష్టం: శ్రియ

బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో శ్రియ ఒక కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, తాను జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, కథానాయకుడి పాత్రతో లింకై ఉంటుందని అంది.

బాలకృష్ణతో కలిసి మరోసారి నటించే ఛాన్స్ రావడం ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. ఇక పూరి దర్శకత్వంలో చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ, అది ఇప్పటికి కుదిరిందని అంది. ఆయన డైరెక్షన్లో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను .. వాటిని తెరపై ఆవిష్కరించడంలోను ఆయన సూపర్ అంటూ కితాబునిచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.    
balakrishna
puri

More Telugu News