రీ మిక్స్ సాంగ్ లో తండ్రి స్టైల్లో అదరగొట్టేస్తోన్న బాలయ్య!
Add ap7am to your home Screen

రీ మిక్స్ సాంగ్ లో తండ్రి స్టైల్లో అదరగొట్టేస్తోన్న బాలయ్య!

బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్' విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వీడియోను వదిలారు. 'జీవితచక్రం' సినిమాలో ఎన్టీఆర్ - వాణిశ్రీ పై చిత్రీకరించిన "కంటిచూపు చెబుతోంది .. కొంటెనవ్వు చెబుతోంది .. మూగమనసులో మాట ఓ పిల్లా" అంటూ సాగే ఆనాటి పాట ఇప్పటికీ సూపర్ హిట్టే.

 ఆ పాటను ఈ సినిమాలో రీ మిక్స్ చేసి .. బాలకృష్ణ - ముస్కాన్ పై విదేశాల్లో చిత్రీకరించారు. ఆ సాంగ్ వీడియోను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. తండ్రి పాటలో .. ఆయనను ఇమిటేట్ చేస్తూ బాలకృష్ణ వేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ రీ మిక్స్ చేసిన ఈ సాంగ్, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం వుంది.   
balakrishna
shriya

More Telugu News