రొమాంటిక్ లవ్ స్టోరీలో అందాల అదితీ ఆర్య!
Add ap7am to your home Screen

రొమాంటిక్ లవ్ స్టోరీలో అందాల అదితీ ఆర్య!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇజం' చిత్రంలో మెరిసిన అదితీ ఆర్య ..  గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అమ్మడిని వెతుక్కుంటూ తరువాత అవకాశం రావడానికి ఆలస్యమే అయింది.

 హవీష్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరామ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రమేష్ వర్మ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అదితీ ఆర్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 'ఇజం' తరువాత చాలా అవకాశాలు వచ్చాయనీ .. ఈ కథ నచ్చడం వల్లనే వెంటనే ఓకే చెప్పానని అదితీ ఆర్య అంటుండటం విశేషం. 
aditi arya

More Telugu News