జై లవ కుశ .. స్పైడర్ లతో పోటీ అంటే మాటలా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జై లవ కుశ .. స్పైడర్ లతో పోటీ అంటే మాటలా?

దసరా పండుగ సందర్భంగా 'జై లవ కుశ' సెప్టెంబర్ 21వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక సెప్టెంబర్ 27వ తేదీన 'స్పైడర్' సినిమా విడుదల కానుంది. కథాబలానికి టెక్నాలజీని తోడుచేసుకుని వస్తుండటం ఈ సినిమా స్పెషాలిటీ.

 ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదని అంతా అనుకుంటూ ఉంటే, ఆ రెండు సినిమాల సరసన 'మహానుభావుడు' చేరిపోతున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు. కంటెంట్ పై గల నమ్మకంతోనే యూవీ క్రియేషన్స్ వారు ఈ సాహసం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాలతో పోటీపడి సక్సెస్ ను సాధించే అలవాటు శర్వానంద్ కి ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండోయ్.    
sharvanand

More Telugu News