ఖమ్మంలో 'పైసా వసూల్' ఆడియో వేడుక!
Add ap7am to your home Screen

ఖమ్మంలో 'పైసా వసూల్' ఆడియో వేడుక!

మాస్ ఆడియన్స్ ను అలరించడంలో హీరోగా బాలకృష్ణకి ఒక స్టైల్ ఉంటే .. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి ఒక మార్క్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'పైసా వసూల్' వస్తుండటంతో, సహజంగానే అందరిలో ఆసక్తి వుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన నిర్వహించనున్నారు.

 అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకి 'ఖమ్మం' వేదిక కానుంది. ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను జరపనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్లను కూడా వదిలారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. మరి ఆయన అందించిన ఆడియో ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.   
balakrishna
shriya

More Telugu News