నిర్మాతగా మారే ఆలోచనలో బాలకృష్ణ?
Add ap7am to your home Screen

నిర్మాతగా మారే ఆలోచనలో బాలకృష్ణ?

కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి బాలకృష్ణ ఫుల్ బిజీ. వరుస సినిమాలు .. వరుస విజయాలతో ఆయన తన దూకుడు చూపిస్తూనే వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ, ఆ మధ్య 'నర్తనశాల' రీమేక్ తో నిర్మాతగా మారాలని చూశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

 అప్పటి నుంచి మళ్లీ నటనపైనే దృష్టి పెడుతూ వచ్చిన బాలకృష్ణ, ఇప్పుడు నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తనకి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతతో కలిసి కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారట. ఈ బ్యానర్ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ వుండే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
balakrishna

More Telugu News