బాలకృష్ణ జెంటిల్ మేన్ అంటోన్న కైరా దత్
Add ap7am to your home Screen

బాలకృష్ణ జెంటిల్ మేన్ అంటోన్న కైరా దత్

బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' తెరకెక్కుతోంది. శ్రియ - ముస్కాన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, కైరా దత్ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. బాలకృష్ణకి .. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ సందర్భంలోనే తాను బాలకృష్ణతో డిన్నర్ డేట్ కి వెళ్లినట్టుగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

 బాలకృష్ణ వ్యక్తిత్వం ఎంతో గొప్పదంటూ కైరా దత్ చెప్పింది. బాలకృష్ణ మంచి మనసున్నవారనీ .. జెంటిల్ మేన్ అని అంది. ఆయన చూపించే ఆప్యాయత .. గౌరవం తనకి ఆశ్చర్యాన్ని .. ఆనందాన్ని కలిగించాయని చెప్పింది. ఆయనతో డిన్నర్ డేట్ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో కైరా దత్ పాత్ర ఏమిటో .. ఆమె ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 29 వరకూ వెయిట్ చేయాల్సిందే.
balakrishna
shriya

More Telugu News