నైజామ్ లో ఫ్యాన్సీ రేటుకు 'పైసా వసూల్'
Add ap7am to your home Screen

నైజామ్ లో ఫ్యాన్సీ రేటుకు 'పైసా వసూల్'

మొదటి నుంచి కూడా కథల విషయంలో బాలకృష్ణ పంథా వేరు .. హీరోయిజాన్ని తెరపై పూరీ జగన్నాథ్ ఆవిష్కరించే పద్ధతి వేరు. అలాంటి ఈ కాంబినేషన్లో 'పైసా వసూల్' తెరకెక్కుతోంది. దాంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఏరియాల వారీగా ఈ సినిమా హక్కుల కోసం గట్టిపోటీ వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 నైజామ్ ఏరియా హక్కులను 'గ్లోబల్ సినిమాస్' వారు దక్కించుకున్నట్టు సమాచారం. ఇందుకోసం వాళ్లు భారీ మొత్తాన్ని ఫ్యాన్సీ రేటుగా చెల్లించారని చెప్పుకుంటున్నారు. ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణ స్టైలిష్ లుక్ .. మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే టైటిల్ .. 'శాతకర్ణి' తరువాత బాలకృష్ణ - శ్రియ కలిసి నటిస్తుండటం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరుగుతోందని చెప్పుకుంటున్నారు.
balakrishna
shriya

More Telugu News