బాలకృష్ణతో సినిమా కోసం రంగంలోకి మైత్రీ మూవీస్?
Add ap7am to your home Screen

బాలకృష్ణతో సినిమా కోసం రంగంలోకి మైత్రీ మూవీస్?

అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తూ మైత్రీ మూవీస్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన మైత్రీ మూవీస్ వారు ప్రస్తుతం చరణ్ తో చేస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ .. నాగచైతన్య లతో చేయడానికి వాళ్లు రెండు ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు.

 ఇక బాలకృష్ణతోను ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను మధ్య చర్చలు నడిచినట్టు సమాచారం. తమ కాంబినేషన్లో మరో సినిమా చేయాలనే ఆలోచనలో వాళ్లు వున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించడానికి మైత్రీ మూవీస్ వారు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వాళ్ల ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.       
balakrishna

More Telugu News