'పైసా వసూల్' రిలీజ్ డేట్ మరింత ముందుకు?
Add ap7am to your home Screen

'పైసా వసూల్' రిలీజ్ డేట్ మరింత ముందుకు?

పూరీ జగన్నాథ్ ఎంత ఫాస్టుగా సినిమాలను తెరకెక్కిస్తాడనేది అందరికీ తెలిసిందే. అదే పద్ధతిని ఆయన 'పైసా వసూల్' సినిమా విషయంలోను అనుసరించాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకుంది. షూటింగును మొదలుపెట్టిన రోజునే ఈ సినిమాను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమాకి పోటీగా మహేశ్ .. ఎన్టీఆర్ మూవీలు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా అక్టోబర్ కి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదట .. పైపెచ్చు ఈ సినిమా రిలీజ్ డేట్ మరింత ముందుకు జరగనుందని అంటున్నారు. ఈ సినిమా ఫస్టు కాపీ సెప్టెంబర్ 15కి రెడీ అవుతుందట. అందువలన ఆ నెల 21న గానీ 22 గాని సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.   
balakrishna
shriya

More Telugu News