జగన్ అధికారంలోకి వస్తే చేపట్టే 9 కార్యక్రమాలు ఇవే!

09-07-2017 Sun 17:24 | Both States
‘అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని ఊరూరా వెళ్లి చెప్పండి‘ అంటూ వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్లీనరీలో పిలుపు నిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే 9 కార్యక్రమాలు ఇవే నంటూ జగన్ ప్రకటించారు. వాటి వివరాలు..

1. వైఎస్సార్ భరోసా:  5 ఎకరాలలోపు రైతులకు రూ.50 వేల సాయం.
2. వైఎస్సార్ ఆసరా: డ్వాక్రా మహిళల కోసం.. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో, దాన్ని నాలుగు విడతలుగా చెల్లించడం. సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం
3. పింఛన్లు: ప్రస్తుతం ఇస్తున్న రూ.1000కు బదులు రూ.2000 ఇవ్వడం
4. ‘అమ్మ ఒడి’ : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ.750 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1500. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.2 వేలు నేరుగా తల్లులకే ఇస్తారు.
5. హౌసింగ్:  ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు. జన్మభూమి వంటి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు. దీని కింద 25 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వడం
6. ఆరోగ్యశ్రీ: ‘ఆరోగ్యశ్రీ’కి బడ్జెట్ లో అవసరమైన నిధుల కేటాయింపు. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థికసాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
7. ఫీజ్ రీయంబర్స్ మెంట్ : ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్. ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు
8. జలయజ్ఞం: పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం
9. మద్య నిషేధం: మూడు దశలలో ఉంటుంది.
మొదటిదశలో.. ఊరూరా వెలిసిన బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం.  
రెండో దశలో.. పేద, మధ్య తరగతికి మద్యం అందుబాటులో లేకుండా నిషేధం విధించడం.
మూడో దశలో.. ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా చర్యలు తీసుకోవడం. మద్యం తయారు చేసినా, అమ్మినా, ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చట్ట సవరణ తీసుకురావడం.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more