నంద్యాల ఉప ఎన్నిక బరిలో మూడో పార్టీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద్యాల ఉప ఎన్నిక బరిలో మూడో పార్టీ!

నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ, వైసీపీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇరు పార్టీలు కూడా ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక బరిలోకి మూడో పార్టీ కూడా దిగింది. తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడుతున్నట్టు రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంలా మారాయని... ప్రజా సేవ గురించి, ప్రాంత సమస్యల గురించి ఆలోచించే నాయకులే రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు బలంతో గెలవచ్చనే ధీమాతో నేతలు ఉన్నారని అన్నారు. తాము మాత్రం హుండీలను ఏర్పాటు చేసి, ప్రజలు ఇచ్చిన చందాలతో ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని... వైసీపీ అధినేత జగనేమో రాయలసీమను అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

More Telugu News