ట్రంప్ తో సంతోషంగా లేము...ఇది అమెరికన్లకు మంచి అనుభవం: హాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రంప్ తో సంతోషంగా లేము...ఇది అమెరికన్లకు మంచి అనుభవం: హాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఇంకా అమెరికన్లలో వ్యతిరేకత పోలేదు. ట్రంప్ పాలనపై హాలీవుడ్‌ నటుడు అన్సెల్‌ ఎల్టోర్ట్‌ మాట్లాడుతూ, ట్రంప్ పరిపాలన ఏమాత్రం సంతోషకరంగా లేదని పెదవి విరిచాడు. అయితే అమెరికన్లకు ఇదో మేలుకొలుపులా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మున్ముందు ఇలాంటి వ్యక్తులు అధ్యక్షులు కాకుండా జాగ్రత్త పడతామని ఆయన చెప్పాడు. చాలా మంది ప్రజలు ఈ అనుభవం నుంచి ఏమీ నేర్చుకోలేకపోతున్నారని, చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని చెప్పాడు.

మరో పదేళ్లకు ఒబామాలాంటి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడవుతాడని, ఆ తరువాత మళ్లీ ఇడియట్ లాంటి వ్యక్తి చేతిలోకి దేశం వెళ్లిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రంప్ అసమర్థుడని, అమెరికన్లకు అవసరమైన విషయాలన్నీ దూరం చేస్తున్నాడని ఆయన పేర్కొన్నాడు. ప్రజలకు సామాజిక సేవల్ని దూరం చేస్తున్నాడని ఆయన మండిపడ్డాడు. 

More Telugu News