Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాంచెస్టర్ సూసైడ్ బాంబర్ తండ్రి, సోదరుడి అరెస్ట్.. లిబియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాంచెస్టర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడి 22 మంది మరణానికి కారణమైన అనుమానిత ఉగ్రవాది తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం లిబియాలో అరెస్ట్ చేశారు. ఉగ్రవాది తండ్రి రమదాన్ అబేదీని ట్రిపోలిలో ఆయన ఇంటిబయట బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్టు ఉగ్రవాద వ్యతిరేక దళం పేర్కొంది. అలాగే మంగళవారం సాయంత్రమే ఉగ్రవాది సోదరుడు హషేమ్ అబేదిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఐసిస్‌తో సంబంధాలున్నాయని అధికారులు చెబుతుండగా రమదాన్ అబేదీని ఎందుకు అరెస్ట్ చేసిందీ అధికారులు వెల్లడించలేదు. హషేమ్ అబేదీ దాడి ముందు వరకు సోదరుడు సల్మాన్ అబేదీతో ‘టచ్’లో ఉన్నట్టు ఉగ్రవాద వ్యతిరేక దళం అధికార ప్రతినిధి అహ్మద్ బిన్ తెలిపారు.

More Telugu News