నా వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదు.. చంద్రబాబుకు వివరణ ఇచ్చిన చిత్తూరు ఎంపీ.. మ్యాటర్ క్లోజ్!

02-05-2017 Tue 07:08 | Andhra
అంబేద్కర్ జయంతి సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై అప్పట్లో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది క్రమశిక్షణ చర్యల వరకు వెళ్లింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఎంపీ చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏమాత్రం లేదని, దళితుల మనోభావాలను అర్థం చేసుకోవాలనే తాను అన్నానని పేర్కొన్నారు. వారిని మరింత దగ్గరకు తీసుకోవాలనే అలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు.  

ఎంపీ వివరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలి కానీ బహిరంగ సభలో మాట్లాడడం, మీడియా ముందుకు వెళ్లడం సరికాదంటూ ఎంపీని గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ‘‘మీ వ్యవహార శైలిని గమనిస్తున్నా. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కానీ పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు. ఇలా చేయడం వల్ల ప్రజలకు, ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు వెళతాయి’’ అని చంద్రబాబు కాస్త గట్టిగానే హెచ్చరించినట్టు తెలిసింది. గంటపాటు జరిగిన వీరి సమావేశంలో ఎట్టకేలకు కథ సుఖాంతమైనట్టు పార్టీ  నేతలు చెబుతున్నారు.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more