రాష్ట్రాన్ని కాంగ్రెస్ గబ్బుమయం చేసింది.. మూడేళ్లలో పోయేదా అది?: మంత్రి కేటీఆర్

04-04-2017 Tue 07:32 | Telangana
ఐదున్నర దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని గబ్బుమయం చేసిందని, ప్రస్తుతం దానిని తుడిచే పనిలో ఉన్నామని రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది మూడేళ్లలోనే పోయే మురికి కాదని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో సోమవారం నిర్వహించిన ‘జన జాగృతి ప్రజా సదస్సు’లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. వారెన్ని కుయుక్తులు పన్నినా ‘పాలమూరు-రంగారెడ్డి’ పథకం ద్వారా పాత రంగారెడ్డి జిల్లాకు  నీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు పాలమూరులో కేసులు వేస్తున్న నేతలు, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మనసున్న మనిషని, ధర్నాలు, డిమాండ్లు, ఎర్ర జెండా విన్నపాలు లేకుండానే ప్రజలకు కావాల్సింది చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, కాంగ్రెస్ పని ఖతమైందని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి కూడా మాట్లాడారు.

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more