ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు.. ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ పేరిట రిలయన్స్ జియో మరో అద్భుత ఆఫర్!

03-04-2017 Mon 15:46 | Technology
ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోన్న రిల‌య‌న్స్ జియో ఈ రోజు మ‌రో ఆఫ‌ర్‌ను గుప్పించింది. జియో సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట ప‌లు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇటీవ‌లే జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించి, 303 రూపాయ‌ల‌తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెల‌లు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపిన విష‌యం తెలి‌సిందే. అయితే ఆ ఆఫ‌ర్‌ను కొన‌సాగిస్తూనే మ‌రిన్ని సౌల‌భ్యాల‌ను క‌ల్పించింది.

జియో ఈ రోజు ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం... రూ.303తో రీచార్జి చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను  ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు. అంతేగాక నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు.

ఇక ఇటువంటి కొత్త ఆఫ‌ర్లనే జియో మ‌రికొన్ని తీసుకొచ్చింది. రూ.499తో రీచార్జి చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు.. ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, దీనిలో నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చు. రూ.999తో రీచార్జి చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటాతో అందిస్తోంది. రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 90 రోజుల కాల వ్య‌వ‌ధితో అందిస్తోంది. దీంతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా కూడా పొంద‌వ‌చ్చు.  రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఆరునెల‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఇక‌ రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ల‌కు కూడా అదనంగా 100 జీబీ ఉచిత డేటా అందిస్తోంది.

కాగా, ఇంత‌కు ముందు ఉన్న ఆఫ‌ర్ రూ.149తో రీచార్జి ఆఫ‌ర్‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. ఈ రీచార్జ్‌తో 2 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 28 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more