ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, షూటింగ్ ను పక్కనబెట్టి, కుమారుడితో ఆటలాడుతూ సేదదీరాడు. కొడుకు పుట్టిన రోజును గోవాలో జరుపుకున్న అల్లు వారబ్బాయి, కొడుకును భుజాన ఎక్కించుకుని ఈత కొలనులో సందడి చేస్తూ, తీయించుకున్న ఫోటోను ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా బేబీ బాయ్ బర్త్డే సందర్భంగా గోవాలో హాలీడే జరుపుకుంటున్నాను..’ అంటూ ట్వీట్ చేశారు. రెండు గంటల క్రితం అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేయగా, వందలాది మంది అభిమానులు దీన్ని రీట్వీట్ చేయడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Holiday in goa with my Baby Birthday Boy ! Muuaahhhhh! pic.twitter.com/ZVPtofQt5C
— Allu Arjun (@alluarjun) 3 April 2017