దేశంలో ఉగ్రవాదం కంటే ప్రేమే ఎక్కువమందిని పొట్టనపెట్టుకుంటోంది!.. విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి

02-04-2017 Sun 07:31 | Offbeat
అవును.. దేశంలో ఉగ్రవాదం కారణంగా బలవుతున్నవారికంటే ప్రేమ వల్ల బలవుతున్న వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ. 2001-2015 మధ్య గణాంకాలను విశ్లేషించినప్పుడు విస్తుగొలిపే ఈ వాస్తవం బయపడింది. ఈ మధ్యకాలంలో దేశంలో 38,585 హత్యలు, ద్వేషపూరిత హత్యల కేసులు నమోదయ్యాయి. అలాగే 79,189 ఆత్మహత్యలు, 2.6 లక్షల కిడ్నాపులు నమోదయ్యాయి. పెళ్లే లక్ష్యంగా ఈ కిడ్నాపులు జరగడం గమనార్హం. వీటిలో సగటున ఏడు హత్య కేసులు, 14 ఆత్మహత్యలు, 47 కిడ్నాపులకు ప్రధాన కారణం ప్రేమ. ఇక ఇదే కాలంలో ఉగ్రవాదం కారణంగా 20 వేలమంది మరణించారు. వీరిలో సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.

ఇక ప్రేమ కారణంగా ఎక్కువమంది హత్యకు గురవుతున్న వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) నిలిచింది. 2001-15 మధ్య కాలంలో పైన చెప్పుకున్న రాష్ట్రాల్లో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులకు ఏదో రకంగా ప్రేమతో లింకులు ఉండడం గమనార్హం.

ఇక  ప్రేమ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారు పశ్చిమబెంగాల్‌లోనే ఎక్కువ. అక్కడ 14 ఏళ్ల కాలంలో (2012 గణాంకాలు లభ్యం కాలేదు) ఏకంగా 15 వేల మంది ప్రేమ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9,405 ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా అస్సాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారితో పోలిస్తే ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆరు రెట్లు అధికమని గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more