అమెరికాలో ఫేస్ బుక్ పై నిషేధం దిశగా డొనాల్డ్ ట్రంప్!

01-04-2017 Sat 17:10 | National
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌నకు ఫేస్ బుక్ టార్గెట్‌గా మారింది. త‌మ దేశ వ్యాప్తంగా ఆ సోష‌ల్ మీడియా సైట్ వాడ‌కంపై నిషేధం విధించ‌డానికి ఆయ‌న సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఫేస్‌బుక్‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంత‌కం చేయ‌నున్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు.

అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని కొంత‌మంది రిపబ్లికన్‌ లీడర్లు అంగీక‌రించ‌డం లేదు. ఈ విష‌య‌మై తమ నేత‌ల‌తో ట్రంప్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారని సంబంధిత అధికారులు తెలిపారు. ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాము కూడా ఈ అంశంపై ప‌లు నిర్ణయాలు తీసుకోవడం పాలనలో భాగమని ట్రంప్ అన్నారని పేర్కొన్నారు.

మ‌రోవైపు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లపై మాత్రం ఆయ‌న ఎటువంటి చర్య‌లు తీసుకోవ‌డం లేదు. ట్రంప్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఇప్పటికే  పెద్ద ఎత్తున ఫేస్ బుక్ యూజర్లు ఆందోళన తెలిపారు. ట్రంప్ ఇందుకు సంబంధించిన ఆర్డ‌ర్‌ను జారీ చేస్తే తాము దానికి మద్దతిస్తామని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అన్నారు. దీనిపై ఫేస్ బుక్  సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ... అమెరికాలో ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేసినప్పటికీ కాలిఫోర్నియా నుంచే తమ ఆపరేషన్లు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే, ఫేక్ న్యూస్ ప్ర‌చారానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసే పద్ధతి ఇది కాదని ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more