మాజీ మంత్రి, టీడీపీ నేత దాడి వీరభద్రరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి జంక్షన్ వద్ద దాడి వీరభద్రరావు కారు ఆగివున్న సమయంలో లారీ ఢీ కొట్టింది. దీంతో, కారు ధ్వంసం కాగా, స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.