యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై మోదీ డేగకన్ను.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి పర్యవేక్షణ బాధ్యత!

20-03-2017 Mon 20:22 | National
ఉత్తరప్రదేశ్‌ లో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీహార్ పై మోదీ విపరీతమైన ప్రేమ చూపించి, ఎన్నికల సమయంలో వరాల జల్లు కురిపించారు. దీంతో బీహార్ లో విజయం తమనే వరిస్తుందని ఆశించారు. అయితే, బీహారీలు మోదీని నమ్మలేదు. దీంతో నితీష్-లాలూ కూటమి అధికారం చేపట్టింది. ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ఓట్లు ప్రభావవంతంగా ఉండడంతో యూపీలో విజయం చాలా కష్టమని దేశవ్యాప్తంగా అన్ని వార్తాసంస్థలు, సర్వే ఏజెన్సీలు ఎన్నికల ప్రచారం సమయంలో పేర్కొన్నాయి.

అయితే ఊహించని మెజారిటీతో యూపీని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో యూపీపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ప్రధాని నిర్ణయించారు. అదీ కాక యూపీకి ముఖ్యమంత్రిగా వివాదాస్పద మత గురువుగా పేరొందిన ఆదిత్యనాథ్ ను ఎంపిక చేయడంతో వివాదాలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూపీలో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై నిఘా పెట్టాలని భావిస్తున్నారని సమాచారం.

దీంతో ఈ నిఘాను సమర్థవంతంగా నిర్వహించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. దీంతో పీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అయిన మిశ్రా సీఎం యోగి ఆదిత్యనాథ్ తో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి, సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, ఆయన నిత్యం యోగితో టచ్ లో ఉంటూ, యూపీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇండియా టుడే ప్రత్యేక కథనం రాసింది. అందులో యూపీ కేడర్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారని పేర్కొంది. యూపీ ప్రభుత్వం భవిష్యత్ లో చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తరువాతనే చేపట్టనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more