Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబూల్ లో ఆత్మాహుతి దాడి!

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. కాబూల్ లోని ఆర్మీ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఆర్మీ సిబ్బంది అడ్డుకుంటున్నా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆర్మీ ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడి సభ్యుడికి సహకరించిన ఇచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆటకట్టించడంతో ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు చోటుచేసుకుంటన్నాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News