బ్రెజిల్ దౌత్యాధికారి హత్య... పోలీసు ప్రియుడితో భర్తను చంపించిన భార్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రెజిల్ దౌత్యాధికారి హత్య... పోలీసు ప్రియుడితో భర్తను చంపించిన భార్య

బ్రెజిల్ లో గ్రీకు దౌత్యాధికారి కిరియకోస్ అమిరిడిస్ (59) హత్య వెనకున్న అక్రమ సంబంధం కోణాన్ని పోలీసు అధికారులు కనిపెట్టారు. సోమవారం నాడు కిరియకోస్ హత్యకు గురికాగా, గురువారం నాడు రియోలో ఓ కారులో దహనమైన స్థితిలో ఆయన మృతదేహం పడివుంది. ఈ కేసులో కిరియకోస్ భార్య ఒలివెరా (40), ఆమె పోలీసు ప్రియుడు మొరియిరా (29)ల ప్రమేయముందని, మొరియిరా కజిన్ కూడా హత్యకు సహకరించాడని పోలీసులు తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనకపోయినా, కుట్ర గురించి ఒలివెరాకు తెలుసునని పేర్కొన్నారు.

డిసెంబర్ 21 నుంచి తన బార్యతో కలసి కిరియకోస్ రియో డీ జనీరో పర్యటనలో ఉన్నారని, వాస్తవానికి ఆయన జనవరి 9న బ్రెజిల్ కు చేరుకోవాల్సి వుందని తెలిపారు. ఈ కేసులో తొలుత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, తన భర్త టాక్సీలో బయటకు వెళ్లాడని, ఆపై తిరిగి రాలేదని ఒలివెరా తెలిపింది. ఆపై విచారణలో అసలు నిజాన్ని ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు.

More Telugu News