పూజించినా ఫలితమివ్వని దేవుడు ఎందుకంటూ ఓ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ కలహాలతో మనోజ్ బంజారా(37) భార్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు బంజారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక తనకు దేవుడే దిక్కంటూ పాల్డాలోని పురాతన ఖేడపటి హనుమాన్ ఆలయంలో పూజలు చేశాడు. తన భార్యను ఎలాగైనా తన వద్దకు తిరిగి చేర్చేలా కరుణించాలంటూ పూజలు నిర్వహించాడు. అయినా ఆమె తిరిగి తన చెంతకు రాకపోవడంతో మనస్తాపం చెందిన బంజారా శనివారం రాత్రి ఆలయంలోని హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన బంజారాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ శశికాంత్ తెలిపారు.
ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త గుప్పుమనడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆరెస్సెస్‌కు చెందిన ధర్మజాగరణ్ విభాగం స్థానిక కార్యకర్తలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్