ఎటువంటి వారినైనా యాడ్స్ ఇట్టే ఆకర్షిస్తాయి. యాడ్స్ ముఖ్య ఉద్దేశం బిజినెస్ ను మరింత పెంచుకోవడం. మల్టీ నేషనల్ కంపెనీ అయినా, కుటీర పరిశ్రమ అయినా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు యాడ్స్ ను వాడుకోవడం మామూలే. అయితే ఈ యాడ్ మాత్రం అందుకు భిన్నం. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు.
జలంధర్ కు చెందిన గోపి రుక్రా మరో ఐదుగురు సభ్యులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు ఉండీ వారిని ఏమీ చేయలేని నిస్సహాయుల కోసం రుక్రా తాజాగా ఓ వీడియోతో యాడ్ రూపొందించాడు. అందులో రక్తమోడుతున్న ఓ అమాయకుడిని పట్టుకుని అతడి ఎముకలను ఎక్కడికక్కడ విరిచేశాడు. తనను వదిలేయమని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరం లేని ముఠా.. అతడి శరీరాన్ని మెలితిప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియా, వాట్సాప్ లో అప్ లోడ్ చేశారు. శత్రువులు ఉన్నవారు తనను సంప్రదించాలని, వారి ఎముకలను వీడియోలో చూపించినట్టు విరిచేస్తామని అందులో పేర్కొన్నారు.
దీనిని చూసిన ఫగ్వారా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు 27 కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. కాగా వారి యాడ్ కు విశేష స్పందన వచ్చింది. ముగ్గురు ఇప్పటికే వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో ఇద్దరి ఎముకలు నుజ్జు చేసి కాంట్రాక్ట్ పూర్తి చేసుకోగా మరొకరి పనిపట్టే సమయంలో పోలీసులకు చిక్కారు. యాడ్ వీడియోతోపాటు ఆయుధాలతో ఉన్న తమ ఫొటోలను కూడా వీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు ఎస్టీఎఫ్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ హెచ్ పీఎస్ ఖాన్ పేర్కొన్నారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్