రాష్ట్ర స్థాయి శాసన నిర్మాణ వ్యవస్థలో పెద్దల సభగా పేరుపడ్డ శాసన మండలిలో ఒక్కసారి సభ్యత్వం దొరకడమే గగనమైన ప్రస్తుత తరుణంలో కర్ణాటకకు చెందిన సీనియర్ రాజకీయవేత్త బసవరాజ హొరట్టి ఏకంగా ఏడు సార్లు ఆ సభకు ఎన్నికయ్యారు. వెరసి ఆయన గిన్నిస్ రికార్డులకెక్కారు. మొన్నటిదాకా ఆరు పర్యాయాలు కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. తాజాగా మొన్న జరిగిన ఆ రాష్ట్ర మండలి ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.
కర్ణాటకలోని పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. 1980లో తొలిసారిగా ఇదే నియోజకవర్గం నుంచి రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన విజయ బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత అదే నియోజకర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చిన బసవరాజ... 1986, 1992, 1998, 2004, 2010లోనూ పెద్దల సభకు ఎన్నికయ్యారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై గిన్నిస్ రికార్డు పుటలకెక్కారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్