ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజీలో నిన్న జరిగిన 125వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే-47 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ నృత్యాలు చేయడం కలకలం సృష్టించింది. కాలేజీ ఉన్నతాధికారులు సైతం ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతమైంది. ఓ ఉపాధ్యాయుడు 'తుపాకులు చూపవద్దు' అని అరుస్తుండటం కూడా వీడియోలో వినిపించడం గమనార్హం. తుపాకులను విద్యార్థులు వాడారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లేసరికి ఆ విద్యార్థులు పారిపోయారని తెలుస్తోంది.
"నేను చాలాసేపు వేడుకల్లో పాల్గొన్నా. అయితే, ఈ ఘటన నేను వెళ్లిపోయిన తరువాత జరిగింది. ఎవరో బయటి వారు వేడుకలకు ఆయుధాలు తెచ్చారని అనుకుంటున్నా" అని ఎన్ఎస్యూఐ లీడర్ జావేద్ వివరించాడు. తామిచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వచ్చారని తెలిపారు. కాగా, తాము వెళ్లేసరికి ఎవరి వద్దా తుపాకులు లేవని పోలీసులు వెల్లడించారు. వీడియోను చూస్తున్నామని, తుపాకులు పేల్చిన వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్