Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఓటూ హిల్లరీకే!: బరాక్ ఒబామా ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి డెమొక్రటిక్ పార్టీ తరఫున దిగనున్న హిల్లరీ క్లింటన్ కు నిన్న మరింత మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతు హిల్లరీకేనని ఘనంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. పార్టీ తరఫున బరిలోకి దిగే విషయంలో హిల్లరీ క్లింటన్ తో బెర్నీ శాండర్స్ హోరాహోరీగా తలపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో శాండర్స్ పై పైచేయి సాధించిన హిల్లరీ ఇటీవలే డెమొక్రటిక్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు హిల్లరీ అభ్యర్థిత్వానికి ఓటేశారని, తన ఓటు కూడా ప్రజల అభీష్టం మేరకు హిల్లరీకే వేస్తున్నట్లు ఒబామా ప్రకటించారు. శాండర్స్ సత్తా ఉన్న నేతే అయినప్పటికీ ఆయన కంటే హిర్లరీనే మెరుగ్గా రాణించగలరని కూడా ఒబామా పేర్కొన్నారు.

More Telugu News