తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి తీరని లోటు ఏర్పడింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని జిల్లాలో పార్టీ పటిష్ఠతకు అలుపెరగని కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు పర్వత శ్రీసత్యనారాయణమూర్తి అలియాస్ చిట్టిబాబు నిన్న హఠాత్తుగా కన్నుమూశారు. అప్పటిదాకా చలాకీగానే ఉన్న ఆయన రెండు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై కాకినాడలోని తన స్వగృహానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిన్న గుండెపోటుకు గురైన ఆయన కాకినాడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
పర్వత మృతి వార్త తెలియగానే పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లండన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు... అటు నుంచి అటే కాకినాడకు వెళ్లారు. పర్వత భౌతిక కాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పర్వత మృతితో జిల్లాలో టీడీపీకి తీరని లోటు ఏర్పడిందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం నిన్న సాయంత్రానికే పర్వత అంత్యక్రియలు ముగిశాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పర్వత, జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్