వాఘా- అటారీ సరిహద్దుల వద్దకు ఓ వ్యక్తి తన కారులో దూసుకొచ్చిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... అత్యంత కట్టుదిట్టంగా ఉండే భారత్- పాక్ సరిహద్దుల వద్దకు తెల్లవారుజామున 3.45 గంటలకు సురేందర్ సింగ్ అనే వ్యక్తి తన స్కార్పియో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లో దూసుకొచ్చాడు. జీరో లైన్ వద్ద ఉన్న కస్టమ్స్ గేట్లను సైతం తన కారుతో ఢీ కొట్టేశాడు. దీంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. స్వర్ణ జయంతి ద్వార్ కు కొద్ది మీటర్ల దూరంలో ఉన్న బారికేడ్లను ఈ కారు ఢీ కొట్టిందన్నారు.
ఈ సందర్భంగా అమృతసర్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జెస్దీప్ సింగ్ మాట్లాడుతూ, ‘నిందితుడు సురేందర్ సింగ్ కెనడా జాతీయుడు. అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా అతనెందుకు చేశాడన్న విషయం అర్థం కావట్లేదు. అతన్ని మేము ప్రశ్నించగా, తెల్లముఖం వేశాడు. ఏవేవో పాటలు పాడుతున్నాడు. సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు మాకు ప్రాథమిక సమాచారం అందింది. అతనిపై కేసు నమోదు చేశాము’ అని ఆయన చెప్పారు.
సిక్కుల మతగురువు గురునానక్ జన్మస్థలమైన నాన్కానా సాహెబ్ పాకిస్థాన్ లో ఉంది. అక్కడికి వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పని చేశానని సురేందర్ సింగ్ చెప్పాడు. వీసా తీసుకోవడం, ఇతర ఫార్మాల్టీస్ పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే, అక్రమ మార్గంలో అక్కడికి చేరుకోవాలనుకున్నానని చెప్పాడు. అయితే, సరిహద్దుల్లో మన దేశ భద్రత ఏవిధంగా ఉందో తెలియడానికి ఈ సంఘటన నిదర్శనమంటూ పలువురు విమర్శిస్తున్నారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్