అదేంటి తమిళనాడు 'తమిళ నాయుడు'గా ఎప్పుడు మారిపోయిందని అనుకుంటున్నారా? వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అలా మార్చేశారు మరి. గతంలో తమిళనాడు చేసిన విజ్ఞప్తిపై పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటన జారీ చేయగా, అందులో తమిళనాడు అన్న పదాన్ని 'తమిళ నాయుడు' చేసేశారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెంటేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్) కార్యక్రమంలో భాగంగా తమిళ సర్కారు ప్రతిపాదనలు పంపగా, దానిపై ఆ శాఖ స్పందించింది.
అమృత్ పథకానికి సహకరిస్తామని చెబుతూనే 'తమిళ నాయుడు' అంటూ ప్రస్తావించడం కొత్త చర్చకు తెరలేపింది. అంతేలే ఆయన శాఖలోని అధికారులు రోజుకు వేల సార్లు 'naidu' అని రాస్తుంటారుగా. ఇక అలవాటైన చేతులు 'nadu' మధ్యలో 'i' చేర్చేస్తున్నాయి. కాగా, ఇటీవల వెంకయ్య నాయుడు తరచూ చెన్నైని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బీజేపీ మూలాలు ఎంతమాత్రమూ కనిపించని తమిళనాడులో పార్టీని మరింతగా పటిష్టపరచాలని ఆయన భావిస్తూ, ఈ పర్యటనలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్