వినాయక చవితి సమీపిస్తోందంటే చాలు, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో కోలాహలం నెలకొనడం ఏళ్లుగా చూస్తున్నదే. వినాయక చవితి సందర్భంగా కొలువుదీరనున్న గణనాథుల విగ్రహాల చేతిలో లడ్డూలను ఉంచడం తెలిసిందే. ఈ లడ్డూలను చేజిక్కించుకునేందుకు నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి జరిగే వేలంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. ఖైరతాబాదు వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచుతున్న లడ్డూ గత కొన్నాళ్లుగా తాపేశ్వరంలో తయారవుతున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఖైరతాబాదు వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను తయారు చేశారు. ప్రస్తుత్తం తాపేశ్వరం నుంచి బయలుదేరిన ఈ లడ్డూ నేటి రాత్రి హైదరాబాదుకు చేరుకునే అవకాశాలున్నాయి. భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో మల్లిబాబు హైదరాబాదుకు తీసుకువస్తున్నారు. ఇక విశాఖలోని 82 అడుగుల భారీ గణేశుడి విగ్రహం చేతిలో పెట్టేందుకు 8,300 కిలోల లడ్డూ తయారైంది. ఈ లడ్డూ కూడా తాపేశ్వరంలోనే తయారైంది. ఈ లడ్డూ ఇప్పటికే విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం చెంతకు చేరింది. దీనిని తాపేశ్వరం కేంద్రంగా స్వీట్ల తయారీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీభక్తాంజనేయ స్వీట్స్ యజమాని సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) రూపొందించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్