ఈ ప్రపంచంలో ప్రేమ లేదని వాదించే వారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అమెరికన్ సంగీత దర్శకుడు క్రిస్ జీక్యూ పెర్రీ తనకు లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో కనిపించిన ఓ దృశ్యాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టగా 2.3 కోట్ల మంది చూసేశారు. దీర్ఘకాలం పాటు దూరంగా ఉన్న భార్యాభర్తలు బెర్నార్డ్ మిల్స్ (80), కారోలిన్ ఓగ్డెన్ (75) కలుసుకున్న వేళ... వారిలో భావోద్వేగాలు, నిజమైన ప్రేమ వ్యక్తమైన విధానం, ప్రేమను ద్వేషించే వారిని కూడా ప్రేమలో పడేసేలా వున్నాయి. ఎయిర్ పోర్టు ప్రవేశద్వారం వద్ద పూలబొకేతో నిలబడ్డ మిల్స్ వైఖరి ఎందుకో క్రిస్ ను ఆకర్షించింది. దీంతో ఎవరికోసం ఎదురుచూస్తున్నాడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యాడు. గేటులో నుంచి ఓ పెద్దావిడ బయటకు రాగానే, ఆయన కళ్లు వెలిగిపోయాయి. ఇద్దరూ కళ్లతోనే పలకరించుకుంటూ దగ్గరగా చేరారు. క్షణమాత్రం ఆలస్యం లేకుండా ఆవిడ, ఆయన్ను గట్టిగా హత్తుకుపోయింది. గాఢంగా కిస్ చేసింది. ఆ క్షణం అక్కడున్న వారి మనసులు కదిలిపోయాయి.
అప్పటికి వారెవరో క్రిస్ కు తెలియదు. తెలీకుండానే వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఆపై ఈ వృద్ధ జంట తామంతట తామే బయటకు వచ్చి, ఈ వీడియో వెనుక కథను వెల్లడించారు. ఆమె రెండు వారాల క్రితం ఓ వివాహం నిమిత్తం డెలావర్ వెళ్లిందని, ఆ మాత్రం ఎడబాటును కూడా తాను తట్టుకోలేనని మురిపెంగా చెప్పారు. తామిద్దరికీ ఒకరిపై ఒకరంటే అవ్యాజమైన ప్రేమ ఉందని, తానెన్నో చిలిపి పనులు చేస్తుంటానని మిల్స్ తెలిపారు.
"ఎవరికి ఏం అవసరమో మా ఇద్దరికీ తెలుసు. ఆమెకు నచ్చే పనులనే చేసేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. కిచన్ లో వంట చేసేటప్పుడు అకస్మాత్తుగా వెళ్లి కౌగిలించుకుని ముద్దు పెడతాను. టీవీ చూస్తుంటే షడన్ గా వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తాను. ప్రతి రాత్రీ నిద్రించే ముందు తనకు ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పకుండా ఉండే సమస్యే లేదు" అంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ తొలిసారిగా ఎప్పుడు కలుసుకున్నారో తెలుసా? 2007లో మాత్రమే. వీరికి వివాహమై 5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇద్దరికీ తమ తమ మొదటి జీవిత భాగస్వాములు దూరమయ్యారు. పరిచయమైన తరువాత రెండేళ్ల పాటు సెల్ ఫోన్లే మాధ్యమంగా టెక్ట్స్ మెసేజ్ లు, చిలిపి ఊసులతో ఇద్దరూ దగ్గరయ్యారట. ఇప్పుడీ 'లేటు వయసు ఘాటు ప్రేమ', వారి వీడియో, మిల్స్ ప్రేమకబుర్లు యువ నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్