ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన! తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీ నిర్వహించిన ధర్నాలో శవంగా నటించిన ఓ వ్యక్తి నిజంగానే శవమయ్యాడు. వివరాల్లోకెళితే... సేలం జిల్లా ఆత్తూరు రాణిపేటలో ఈ నెల 10న డీఎంకే పార్టీ సంపూర్ణ మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా, మద్యపానానికి అలవాటుపడిన వ్యక్తి ఎలా కడతేరిపోతాడో ఓ ప్రదర్శన రూపంలో వివరించారు. అందులో సేతు అలియాస్ సెల్వరాజ్ అనే డీఎంకే కార్యకర్త మద్యపానం కారణంగా చనిపోయినట్టు ఆ ప్రదర్శనలో నటించాడు. నిజమైన శవాన్ని ఎలా అలంకరిస్తారో అతడిని కూడా అలాగే అలంకరించారు. డీఎంకే ధర్నాలో ఈ శవం స్కిట్ బాగా హైలైట్ అయింది. బాగా నటించావంటూ అందరూ సెల్వరాజ్ ను అభినందించారు. ఆ తర్వాతి రోజే అతడు అనారోగ్యం పాలయ్యాడు.
జ్వరం తీవ్రం కావడంతో అతడిని కుటుంబ సభ్యులు సేలం తీసుకువెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. జ్వర తీవ్రత కాస్త తగ్గిన తర్వాత ఆత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, జ్వరం మళ్లీ తిరగబెట్టడంతో సెల్వరాజ్ శనివారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. దాంతో, కుటుంబంతో పాటు డీఎంకే వర్గాల్లోనూ విషాదం అలముకుంది. ధర్నాలో శవంగా నటించిన వ్యక్తి ఇప్పుడు నిజంగానే శవం కావడం అందరినీ కలచివేసింది. పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి. తమతో పాటు ధర్నాలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడిలా విగతజీవుడిలా మారిపోతాడని ఊహించలేదని డీఎంకే నేతలు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!