మొన్న గుంటూరు, నిన్న ఏలూరు, తాజాగా తిరుపతి... విద్యాలయాల్లో ర్యాగింగ్ జడలు విప్పింది. కోటి ఆశలతో విశ్వవిద్యాలయాల్లో అడుగుపెడుతున్న జూనియర్లపై సీనియర్ల వేధింపులు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనతో కఠిన చర్యలకు చంద్రబాబు సర్కారు తెరలేపినా, సీనియర్లు యథేచ్ఛగా ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎంసీఏ విభాగంలో ఇటీవల జూనియర్లపై సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వర్సిటీలోని డి-బ్లాక్ లో వెలుగు చూసిన ఈ ఘటనపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ దేవరాజు, రెక్టార్ జయశంకర్ దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని తేలింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడ్డ ముగ్గురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!